Sunday, May 8, 2011

అమ్మ

ప్రేమకు  ప్రతిరూపం అమ్మ...
జగతిలో అపురూపం అమ్మ ప్రేమ. 

పువ్వు పూచిన తర్వాత పుట్టేది  పువ్వూ  పరిమళాల మద్య ప్రేమ...
మన కంటే ముందే జన్మించి మనకు జన్మనిచ్చేది అమ్మ ప్రేమ. 

తెల్లని మంచుకు తెలియదు తను పంచే చల్లదనం...
చల్లని తల్లి వడికి తెలియదు తను పంచే గొప్ప అమ్మదనం. 

రంగుల ప్రపంచం పంచేది రంగు రంగుల ప్రేమ...
అమ్మ పంచేది మాత్రం అంతు లేని వర్ణనాతీతమైన అమ్మ ప్రేమ.

మనం అడిగితే పంచుతుందో లేదో తెలియనిది అమ్మాయి ప్రేమ...
మనం అడగకుండానే మనకు దక్కేది అమ్మ ప్రేమ. 

ఈ విశాల ప్రపంచంలో ఒకరిని మొదటి చూపులోనే ఇష్టపడితే అది తోలి ప్రేమ...
ఇదే విశాల ప్రపంచాన్ని మనం చూసే కంటే ముందే పుట్టి మనకు చూపించేది అమ్మ ప్రేమ. 

అందనంత దూరాన ఉన్న ఆ చందమామ...
అమ్మ మనకు గోరుముద్దలు పెడుతూ పిలిస్తే దిగి రాడా కావాలంటూ ఆ అమ్మ ప్రేమ. 
                                                                ప్రియమైన అమ్మకు 

                               ...HAPPY MOTHERS DAY...
                                                                                   దిలీప్ 
                                                                                                              
                                                                                                                                                

Monday, January 10, 2011

పదహారేళ్ళ వయస్సు
"పదహారేళ్ళ వయస్సు
 యవ్వనపు పరిమళాలతో వికసించే  మనస్సు  ..."
"ఏదీ సరిగా తెలియని
వయస్సు
 ఎన్నో తెలుసుకోవాలని తహతహలాడే మనస్సు ..."
"తప్పొప్పులు తెలియని
వయస్సు
 తప్పును కూడా ఒప్పని ఒప్పించే మనస్సు ..."
"ప్రేమంటే ఏంటో తెలుసుకోవాలి అనుకొనే
వయస్సు
 ఆ ప్రేమను పంచే మనస్సుని వెతికే మనస్సు ..."
"ప్రపంచమంటే ఏంటో తెలిసే
వయస్సు
 ప్రపంచ్చాన్నే ఎదిరించమనే మనస్సు ..."
"కళాశాల మెట్టు ఎక్కే
వయస్సు
 క్లాసు రూములో తపస్సు చేయకు అని చెప్పే మనస్సు ..."
"కొత్త స్నేహాలను పంచే
వయస్సు
 పాత స్నేహాలను మరవద్దనే మనస్సు ..."
"ఇవన్నీ నాలో ఉండి చూసి అంటోంది నాతో నా
మనస్సు
 ఎప్పటికీ తిరిగిరానిది ఆ మరపురాని పదహారేళ్ళ వయస్సు..."                                                                         దిలీప్...